కమల్‌కే ఈర్ష్య పుడుతది..కేటీఆర్‌ ట్వీట్

256
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నికల నడుమ బీజేపీ చేసిన వింతలు విశేషాలు గుర్తుచేసుకుంటే ప్రజాస్వామ్యం మనగలుగుతుందా అని సందేహం తలేత్తుతుంది. మరీ ముఖ్యంగా పోలింగ్‌రోజున చిత్రవిచిత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి. బీజేపీ నాయకులు చేసిన ఓవర్‌ యాక్టింగ్‌ మాములుగా ఉండదు. బీజేపీ నాయకుల యాక్టింగ్‌పై టీఆర్ఎస్‌ నాయకుడు క్రిశాంక్‌ ట్వీట్‌ చేశారు. అయితే బీజేపీ నాయకుల డ్రామాకు సంబంధించిన వీడియోను తన ట్వీట్టర్‌ పేజీలో షేర్‌ చేస్తూ ఇలా రాసుకొచ్చారు.

బీజేపీ నాయ‌కుల డ్రామాను ఈ దేశ ప్ర‌జ‌లు త‌ప్ప‌క చూడాలి. పోలింగ్ స్టేష‌న్‌లోకి మొబైల్ తీసుకెళ్లొద్ద‌ని పోలీసులు సూచించినందుకు.. బీజేపీ నాయ‌కుడు ఒక‌రు హంగామా సృష్టించారు. వేరే వ్య‌క్తికి ఫోన్‌ను విసిరేసి, పోలింగ్ కేంద్రంలోకి ప‌రుగెత్తాడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో సదరు నాయకుడు తనపై పోలీసులు కొట్టినట్టు ఓటర్ల ముందు యాక్ట్‌ చేస్తూ కిందపడి దొంగ ఏడుపును మొదలుపెట్టారని తెలిపారు. మోదీ యాక్టింగ్ స్కూల్ అని క్రిశాంక్ చివ‌ర‌గా రాశారు. ఈ ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేస్తూ.. క‌మల్ హాస‌న్ గ‌ర్వ‌ప‌డేలా న‌టించాడు అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

మోడీ యాక్టింగ్ స్కూల్…నవ్వుఆపుకోలేరు!

ఏపీలో కేసీఆర్ వ్యాఖ్యల కలకలం

జబర్దస్త్‌కి కొత్త యాంకర్

- Advertisement -