బీజేపీ కుటిల ప్రయత్నాలు చేస్తోంది- కేటీఆర్‌

204
ktr
- Advertisement -

తెలంగాణ భవన్‌లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కె తారకరామారావు మీడియా సమావేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. బీజేపీ డబ్బుల డ్రామా ఫెయిల్ అయింది. బీజేపీ దుబ్బాకలో ప్రజలను మభ్యపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా భారీ ఎత్తున  డబ్బు పట్టుబడుతుందని కేటీఆర్‌ ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు బీజేపీ సంబంధించిన కోటి రూపాయలు హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గోబెల్స్ కి పాఠాలు చెప్పే మాదిరి సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైన విషప్రచారాన్ని, దుష్ప్రచారం, అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు కేటీఆర్‌ మండిపడ్డారు.

ఇలాంటి వాటన్నింటినీ టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వైర్లు ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు చేరుస్తున్నారు. ఎల్లుండి ఎన్ని కనుక ఈ రోజు చివరి కుట్రకు బీజేపీ తెర లేపుతోంది. డ్రామాలో భాగంగా చివరి దశ వరకు బీజేపీ రాజకీయ కుట్ర తెరలేపింది. బీజేపీ కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నాన్ని అవకాశంగా మలుచుకుని,  బీజేపీ కుటిల ప్రయత్నాలు చేస్తోందని సమాచారం ఉంది. హైదరాబాదులో డిజిపి కార్యాలయం లేదా ప్రగతి భవన్, తెలంగాణ భవన్ ముట్టడి పేరుతో తమ చివరి కుప్రయత్నానికి తెరలేపి తద్వారా హైదరాబాద్‌లో లాఠీఛార్జ్, లేదా పోలీసు కాల్పులకు బీజేపీ కుట్రలు పన్నుతోందని కేటీఆర్‌ పేర్కొన్నారు.

రేపు బీజేపీ హైదరాబాద్‌లో లాఠీచార్జి, పోలీసుకాల్పులు జరిగే విధంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కుట్ర చేస్తుందనీ, ఈ మేరకు మాకు బీజేపీ పార్టీలోని నాయకులే సమాచారం అందించారన్నారు. ఇలాంటి సమాచారాన్ని రూడీ చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని డిజిపిని కోరుతున్నాం. ఈ మేరకు బీజేపీ కుట్రల పట్ల తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎలక్షన్ కమిషనర్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి మరియు రాష్ట్ర డిజిపిని మా పార్టీ ప్రతినిధుల బృందం కలుస్తుంది. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఏ పార్టీ ప్రయత్నించిన ఉక్కుపాదంతో అణిచివేయాలని రాష్ట్ర డిజిపిని టిఆర్ఎస్ పార్టీ కోరుతుందని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

ఇంత నీచమైన కుట్రలకు పాల్పడుతున్న బీజేపీ అబద్ధాలు, అసత్యా,లు డ్రామాలు, డబ్బులు, అవసరమైతే శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రజలకు గుర్తించి జాగ్రత్తగా ఉండాలని ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను. బీజేపీ లాంటి రాజకీయ శక్తి పట్ల దుబ్బాక జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను అని కేటీఆర్‌ తెలిపారు.

- Advertisement -