ఐటీ గ్రిడ్ గ్రిడ్ కంపెనీ వ్యవహారం ఇప్ప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఏపీ ప్రజల సమాచారాన్ని అక్రమంగా సేకరించారని లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ నెల 2న సైబరాబాద్ పోలీసులు ఐటీ గ్రిడ్ కంపెనీపై కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై నిన్న ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు కంపెనీలకు ఎలా ఇస్తారని ఫైర్ అయ్యారు. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు మాపై అరుస్తే ఏం లాభం అన్నారు.
తాజాగా ఇదే అంశంపై ట్వీట్టర్ ద్వారా చంద్రబాబును మరోసారి ప్రశ్నించారు కేటీఆర్. ఏపీ ప్రజల అనుమతి తీసుకోకుండా వారి వ్యక్తి గత డాటాను ఓ ప్రైవేటు కంపెనీకి ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తెలంగాణ పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలిపారు. ఒక వేళ చంద్రబాబు ఏం తప్పు చేయలేదనుకుంటే ఆయన ఎందుకు ఉలిక్కి పడుతుతున్నారని అన్నారు. ఆయన తప్పు చేయకుంటే విచారణకు సహాకరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పోలీసులకు వ్యతిరేకంగా హైకోర్టులో తప్పుడు పిటిషన్లు దాఖలు చేశారని ఆరోపించారు కేటీఆర్. డేటా గ్రిడ్ విషయంలో చంద్రబాబు ఎపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. ప్రస్తుతం ఉన్న రిపోర్టుల ప్రకారం 3.5కోట్ల మంది ఏపీ ప్రజల సమాచారాన్ని దొంగతనం చేశారని చెప్పారు.
https://twitter.com/KTRTRS/status/1102797556013162496