తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ పార్టీ అవతరించిందన్నారు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణభవన్‌లో ఇవాళ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు హాజరయ్యారు. ఈసమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతో మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తాం. ఎన్నికలకు టీఆర్‌ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. పల్లె ప్రగతి తరహాలోనే పట్టణ ప్రగతి కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు.
పల్లెలు, పట్టనాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా మున్సిపాలిటీలకు భారీగా నిధులు ఇచ్చినట్లు మంత్రి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ ను మరోసారి గెలిపిస్తారని నమ్మకంతో ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా 60లక్షల మంది టీఆర్ఎస్ సైనికులు ఉన్నట్లు తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలు , ఎంపీలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టీఆర్ఎస్ పార్టీ సిద్దంగా ఉంటుందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మున్సిపల్ ఎన్నికల్లో మంచి విజయాన్ని సాధిస్తామనే విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాం అని అన్నారు.