జడ్చర్ల,నకిరేకల్‌లో ఎగిరిన గులాబీ జెండా

394
trs party
- Advertisement -

పుర పోరులో టీఆర్ఎస్‌ దూసుకుపోతోంది.తొలిసారి ఎన్నికలు జరుగుతున్న జడ్చర్ల మున్సిపాలిటీపై టీఆర్‌ఎస్‌ పార్టీ జెండా ఎగురవేసింది. మొత్తం 27 వార్డుల్లో 19 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో టీఆర్‌ఎస్‌ ఇప్పటివరకు 16 వార్డుల్లో విజయం సాధించింది.

నకిరేకల్ మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగిరింది. మొత్తం 20 వార్డుల‌కు గాను 12 వార్డుల‌ను టీఆర్ఎస్ కైవ‌సం చేసుకుని జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది.ఇక ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్‌లోనూ టీఆర్ఎస్ దూసుకుపోతోంది. వరంగల్‌లో ఇప్పటివరకు టీఆర్ఎస్ అభ్యర్థులు 23 మంది గెలుపొందారు.

- Advertisement -