ఖైరతాబాద్‌, సనత్‌నగర్ డివిజ‌న్లలో టీఆర్ఎస్ విజయం..

99
trs

జీహెచ్‌ఎంసీ ఫ‌లితాల్లో టీఆర్ఎస్ విజ‌యఢంకా మోగిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు వెలువ‌డిన ఫ‌లితాల్లో టీఆర్ఎస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలుపొందింది. సనత్ నగర్ డివిజ‌న్ లో టీఆర్ఎస్ అభ్యర్థి కొలను లక్ష్మి ఘ‌న‌విజ‌యం సాధించారు.ఖైరతాబాద్ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయారెడ్డి గెలుపొందారు. చర్లపల్లి డివిజన్ కారు కైవసమైంది. అక్కడ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు.

మ‌రోవైపు గోల్నాక‌లో 1461ఓట్లు, అంబ‌ర్ పేట్ లో 2500 ఓట్ల లీడ్ తో టీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజ‌లో ఉన్నారు. మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి తార్నాక టీఆర్ఎస్ అభ్యర్థి మోతె శ్రీలత శోభన్ రెడ్డి 731 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీఆర్ఎస్ ముందజలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు 16 స్థానాల్లో గెలుపొందగా.. ప్ర‌స్తుతం 65 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.