మున్సిపల్‌ విజయం ఏకపక్షమే..!

530
trs muncipal elections
- Advertisement -

ఆగస్టు తొలివారంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 19న కొత్త మున్సిపల్ చట్టంపై ప్రభుత్వం చట్టం చేయనుండగా పురపాలక సంఘాల ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఏకపక్షమే కానుంది. అసెంబ్లీ,స్ధానిక సంస్థలు,ఎంపీ ఎన్నికల్లో సత్తాచాటిన టీఆర్ఎస్ అదే జోష్‌లో మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేసేందుకు టీఆర్ఎస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు.

ఓ వైపు పార్టీ సభ్యత్వంపై దృష్టి సారిస్తునే మరోవైపు మున్సిపల్‌ ఎన్నికల దిశగా పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసే పనిలో పడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇంచార్జీల నుంచి మున్సిపాలిటీలవారీగా నివేదిక తెప్పించుకుంటున్నారు కేటీఆర్‌. ఆ సమాచారాన్ని క్రోడీకరించి అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయ్యాక ఇన్‌చార్జిలతో కేటీఆర్‌ భేటీ అయ్యే అవకాశం ఉంది. వార్డులు, మున్సిపల్‌ చైర్మన్‌ స్థానాల రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన తర్వాత పార్టీ రాష్ట్ర కార్యవర్గంతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం అవుతారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ అభ్యర్థుల ఎంపికపై పార్టీ యంత్రాంగానికి కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తారని టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.

దీంతో పాటు మున్సిపాలిటీల పరిధిలో సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలపై సర్వే నిర్వహించే బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించినట్లు సమాచారం. సర్వే నివేదిక ఆధారంగా పార్టీ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. మొత్తంగా మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్లాన్‌ రెడీ చేస్తున్నారు గులాబీ బాస్‌.

- Advertisement -