కోటి సభ్యత్వాలు లక్ష్యం..!

378
cm kcr
- Advertisement -

కోటి సభ్యత్వాలే లక్ష్యంగా టీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. ఈ నెల 27 నుంచి ఊరూరా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుండగా తొలి సభ్యత్వం సీఎం కేసీఆర్ తీసుకోనున్నారు. గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్‌లో జరిగే ఈ సమావేశానికి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాజ్యసభ, లోక్ సభ సభ్యులతో కూడిన టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షాన్ని, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మెన్లను, జెడ్పీ చైర్మన్లు హాజరుకానున్నారు.

పార్టీ సభ్యత్వనమోదు కార్యక్రమంతో పాటు పార్టీ సంస్థాగత అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల బాధ్యులకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాలు అందజేస్తారు.

2017లో చేపట్టిన టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ శ్రేణుల నుంచి భారీ స్పందన వచ్చింది.టీఆర్‌ఎస్‌ చరిత్రలోనే తొలిసారిగా 75 లక్షల మంది పార్టీ క్రియాశీల, సాధారణ సభ్యులుగా నమోదయ్యారు. ఈ సారి కోటి మందిని సభ్యులుగా చేర్చడమే లక్ష్యంగా ముందుకుసాగనున్నారు గులాబీ నేతలు.

గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న పార్టీ నేతలతో పాటు ప్రజాప్రతినిధులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా సీఎం కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాలు ఇచ్చారు.సభ్యత్వాల పూర్తి అనంతరం గ్రామ,మండల కమిటీలతో పాటు జిల్లా కమిటీను ఎన్నుకోనున్నారు. సర్పంచ్‌, మండల ఎన్నికలలో అవకాశం రాని పార్టీ నేతలకు మండల స్థాయి పదవులు రానున్నాయి. మొత్తంగా సీఎం కేసీఆర్,కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా కోటి సభ్యత్వాలను పూర్తిచేసి దేశంలోనే అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్‌ను నిలబెట్టేందుకు గులాబీ శ్రేణులు కృషిచేయనున్నాయి.

- Advertisement -