రెండెకరాల్లో కారు గుర్తు ముగ్గు.. కేటీఆర్ ప్రశంసలు..

523
ktr
- Advertisement -

తెలంగానలో ఒకవైపు సంక్రాంతి సంబరాలు మరో వైపు మున్సిపల్ ఎన్నికల జోరు కొనసాగుతోంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఇక టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. సంక్రాంతి పండుగ రావడంతో మహిళలు పార్టీపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మహిళాకార్యకర్తలు ఇండ్ల ముందు సంక్రాంతి ముగ్గుల్లో గుర్తును, కేసీఆర్‌, కేటీఆర్‌, కవితల చిత్రపటాలు వేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సిరిసిల్లలో మహిళలు వినూత్నంగా ముగ్గులు వేశారు.

trs

సంక్రాంతి సందర్భంగా రెండెకరాల స్థలంలో 200 మంది మహిళలు కలిసి కారు గుర్తును ముగ్గుగా వేసి.. అందుకు అనుగుణంగా రంగులు వేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కారు గుర్తు ముగ్గును వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేవలం మూడు గంటల్లోనే ఈ ముగ్గును వేసి.. సరికొత్త రికార్డును సృష్టించారు.

ఈ ముగ్గు వ్యవహారం రాష్ట్ర మంత్రి కమ్ టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరకూ వెళ్లింది. ఆ ముగ్గును చూసిన ఆయన ఫిదా కావటమే కాదు.. ముగ్గు వేసిన మహిళల్ని ప్రసంశించారు కూడా. ఈ కారు ముగ్గును చూసేందుకు స్థానిక పట్టణ వాసులు తండోపతండాలుగా వస్తున్నారు.

- Advertisement -