ఎమ్మెల్సీని సస్పెండ్ చేసిన టీఆర్ఎస్..

448
trs mlc yadavareddy
- Advertisement -

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మరో ఎమ్మెల్సీపై వేటు వేసింది టీఆర్ఎస్. ఇప్పటికే ఎమ్మెల్సీ రాములు నాయక్‌పై వేటు వేసిన టీఆర్ఎస్ తాజాగా కె. యాదవరెడ్డిని పార్టీ నుండి బహిష్కరించింది. ఈ మేరకు టీఆర్ఎస్ కార్యాలయం ఓ ప్రకటన చేసింది. పార్టీ నుండి యాదవరెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది.

యాదవరెడ్డి చేవేళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వర్గంగా ఉన్నట్లు తెలుస్తుండగా విశ్వేశ్వరరెడ్డి గత రెండు రోజుల క్రితం టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం సోనియాగాంధీ సమక్షంలో చేరనున్నారు. ఆయనతోపాటు ఎమ్మెల్సీ యాదవరెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

- Advertisement -