సీఎం కేసీఆర్‌ని కలిసిన కేకే,సురేష్ రెడ్డి

366
cm kcr
- Advertisement -

 హైదరాబాద్ ప్రగతి భవన్ లో  సీఎం కేసీఆర్‌ని కలిశారు టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు కే కేశవరావు,సురేష్ రెడ్డి. తమను రాజ్యసభ అభ్యర్థులుగా నిర్ణయించినందుకు కేశవరావు, సురేష్ రెడ్డి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు కేసీఆర్. చిత్రంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కూడా ఉన్నారు.

తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు స్ధానాలకు గానూ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేకేతో పాటు ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి పేర్లను ప్రకటించారు. శుక్రవారం వీరిద్దరు తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు.

- Advertisement -