నేడు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గం భేటీ..పురపోరుపై చర్చ

493
ktr
- Advertisement -

మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్. ఉదయం 11 గంటలకు జరిగే టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గులాబీ జెండా ఎగురవేసే విధంగా పక్కా ప్రణాళిక, వ్యూహాన్ని సీఎం కేసీఆర్ ఖరారు చేయగా ఆ వ్యూహాన్ని నేతలకు వివరించనున్నారు కేటీఆర్.

ఇప్పటికే పార్టీ కార్యదర్శులు, రాష్ట్రస్థాయి నాయకులు, జీహెచ్‌ఎంసీ పరిధిలోని ముఖ్య నేతలను వివిధ జిల్లాలకు ఇంచార్జీలుగా నియమించగా ఎన్నికల వ్యూహంపై చర్చించిన అనంతరం అభ్యర్థుల ఎంపికపై మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. తొలినుంచి పార్టీ కోసం పనిచేసిన వారు,సామాజిక సమీకరణలు,గెలుపు గుర్రాలు ప్రాతిపదికన అభ్యర్ధులను ఎంపికచేయనున్నట్లు సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, పది కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనుండగా అన్నింటిపై గులాబీ జెండా ఎగురవేసే విధంగా సూచనలు చేయనున్నారు కేటీఆర్.

- Advertisement -