అక్టోబర్ 3వ తేదీ నుండి సీఎం కేసీఆర్ తిరిగి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్టోబర్ 4వ తేదీన జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి జగదీశ్ రెడ్డి. సభ విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై నాయకులతో చర్చించారు జగదీశ్ రెడ్డి. లక్ష మందిని సభకు తరలిస్తామని…ఉమ్మడి నల్గొండ జిల్లాలో మెజార్టీ స్ధానాలు టీఆర్ఎస్‌వే అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, నల్లగొండ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 3 నుంచి 8వ తేదీ వరకు ఐదు భారీ బహిరంగ సభలను నిర్వహించేలా ప్లాన్ చేసింది గులాబీ దళం. అక్టోబర్ 3న నిజామాబాద్,4న నల్గొండ ,5న వనపర్తిలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సభ, 7న ఉమ్మడి వరంగల్ జిల్లా సభ, 8న ఖమ్మం జిల్లాల్లో మహాసభలు నిర్వహించనున్నారు.
ప్రతి సభకు లక్షమందికి తగ్గకుండా జనసమీకరణ చేయాలని ఆయా జిల్లాలలకు చెందిన కీలక నేతలకు పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 105 స్ధానాలకు అభ్యర్థులను ప్రకటించింది టీఆర్ఎస్. ఆ పార్టీ అభ్యర్థులకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఏకగ్రీవంగా టీఆర్ఎస్‌కే ఓట్లేస్తామని ప్రజలు తీర్మానాలు చేస్తున్నారు. తాజాగా కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యే సభలతో కార్యకర్తల్లో మరింత జోష్ నింపనుంది.