విద్యుత్ రంగంలో విజయం…కులవృత్తులను ఆదుకున్నాం

251
Trs plenary Updates
- Advertisement -

కులవృత్తులను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే   డా సురేఖ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ ప్లీనరీ సందర్భంగా.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం, కులవృత్తులపై తీర్మానం ప్రవేశపెట్టిన సురేఖ…. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు.  రైతులకు రుణాలు మాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని తెలిపారు. 75 శాతం సబ్సిడీతో గొల్లకురుమలకు త్వరలోనే గొర్రెపిల్లలను పంపిణీ చేస్తామని ప్రకటించారు. గొర్రెపిల్లల పంపిణీలో లబ్ధిదారుల ఎంపిక పాదర్శకంగా జరుగుతుందన్నారు.

ఈ బడ్జెట్‌లో చేనేత కార్మికుల సంక్షేమం కోసం రూ. 1200 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో చేనేత రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని తెలిపారు. చేనేత కార్మికుల ఆకలి చావులు చూడొద్దన్నదే సీఎం లక్ష్యమని ఉద్ఘాటించారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం సీఎం కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. 50 వేల పవర్‌లూమ్స్‌కు సబ్సిడీ ఇచ్చి కార్మికులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

వెయ్యి ఎకరాల్లో కోట్లాది రూపాయాలతో టెక్స్‌టైల్స్ ఏర్పాటు చేయడానికి సీఎం నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేశారు. సిరిసిల్లలో అపెరాల్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. నేతన్నల కుటుంబాల్లో దుఃఖాన్ని దూరం చేసి.. సంతోషాన్ని నింపేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉద్ఘాటించారు.

తెలంగాణ రాష్ట్రంలో నాయి బ్రహ్మణుల ముఖచిత్రం మార్చాలన్నదే సీఎం లక్ష్యమని తెలిపారు. 25 వేల మోడ్రన్ సెలూన్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధునాతమైన సెలూన్లను నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సంవత్సరం నుంచే నవీన సెలూన్లను ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. కొండా సురేఖ ప్రవేశపెట్టిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం, కులవృత్తుల తీర్మానాన్ని రామగుండం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ బలపరిచారు.

విద్యుత్ రంగంలో విజయం సాధించాం..

సీఎం కేసీఆర్ త్రిముఖ వ్యూహంతో రాష్ట్రంలో కరెంట్ సమస్యను అధిగమించామని తెలిపారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. విద్యుత్ రంగంలో విజయం, పరిశ్రమల స్థాపన, ఐటీ రంగ అభివృద్ధిపై ఎమ్మెల్సీ పల్లా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే విద్యుత్ రంగంలో విజయం సాధించామని  తెలిపారు.   వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని చెప్పారు.

పరిశ్రమలకు కరెంట్ ఇవ్వడంతో మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నారని తెలిపారు. నాడు పవర్ హాలిడే అయితే.. నేడు ఎవ్రీ డే కరెంట్ అని పేర్కొన్నారు. పరిశ్రమల ద్వారా 45 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 3 వేల పరిశ్రమలు నెలకొల్పబడ్డాయని తెలిపారు. విద్యుత్ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతున్నామని ప్రకటించారు. చిన్న పరిశ్రమల్లో ఉత్పత్తులు మూడు రెట్లు పెరిగాయన్నారు. విద్యుత్ ఉద్యోగాల్లో సీఎం విశ్వసనీయత పెంచారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ పల్లా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు ఆమోదించారు.

- Advertisement -