టీఆర్ఎస్ ప్లీనరీకి మహానగరం ముస్తాభైంది. హెచ్‌ఐసీసీ వేదికగా జరిగే ప్లీనరీ నేపథ్యంలో 27న ట్రాఫిక్ ఆంక్షలు విధించగా వచ్చే కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ముఖ్యంగా ప్లీనరీ అనగానే గుర్తుకొచ్చేది తెలంగాణ వంటకాలు.
ప్లీనరీకి హాజరయ్యే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు నోరూరించే వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ప్లీనరీలోని వంటల ప్రాంగణం రుచికరమైన వంటకాలతో ఘుమఘుమలాడుతోంది. మొత్తం 33 రకాల వెరైటీలను ఏర్పాటు చేశారు.
డబుల్‌కామీట, గులాబ్‌జామ్, మిర్చిబజ్జీ, రుమాలీ రోటీ, తెలంగాణ నాటు కోడి కూర, చికెన్‌ధమ్ బిర్యానీ, ధమ్‌కా చికెన్,మిర్చి గసాలు, ఆనియన్ రైతా, మటన్‌కర్రీ, తలకాయ కూర, బోటీదాల్చా, కోడిగుడ్డు పులుసు, బగారా రైస్, మిక్స్‌డ్ వెజ్ కుర్మా, వైట్ రైస్, మామిడికాయ పప్పు, దొండకాయ, కాజుఫ్రై, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, ములక్కాడ, కాజు, టమాట కర్రీ,వెల్లిపాయ కారం, టమాట, కొత్తిమీర తొక్కు, మామిడికాయ తొక్కు, పప్పుచారు అప్పడం, పచ్చిపులుసు, ఉలువ చారు క్రీమ్,టమాట రసం, పెరుగు, బటర్‌స్కాచ్ ఐస్‌క్రీమ్, ఫ్రూట్స్ స్టాల్, అంబలి, బటర్ మిల్క్.