కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి బలం- మంత్రి కొప్పుల

196
Minister Koppula Eshwar
- Advertisement -

జగిత్యాల జిల్లాను పార్టీ సభ్యత్వంలో నెంబర్ వన్‌గా నివపాలన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్‌. జగిత్యాల జిల్లా కేంద్రంలో పొన్నాల గార్డెన్‌లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై జిల్లా కార్యకర్తల సమావేశంలో మంత్రి కొప్పుల పాల్గొన్నారు. జిల్లాలో తొలి పార్టీ సభ్యత్వం నమోదు చేసుకొని, పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లా పార్టీ సభ్యత్వంలో నెంబర్ వన్ గా నిలవాలి. అన్నింటిలో ఆదర్శంగా ఉన్న జిల్లా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆదర్శంగా నిలవాలి. కార్యకర్తలే టిఆర్ఎస్ పార్టీ కి బలం.. పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలదే మంత్రి తెలిపారు.

గ్రామ శాఖ అధ్యక్షులు పార్టీలో వివిధ స్థాయిలో పని చేస్తున్నటువంటి నాయకులందరూ కూడా పార్టీ కార్యక్రమాల్లో మళ్లీ ఉదృతంగా ముందుకు పోవడం కోసం మన నాయకుడు కేసీఆర్ తిరిగి తీసుకున్న నిర్ణయం. ఈ సభ్యత్వ నమోదు. గ్రామస్థాయి నుంచి జిల్లా రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణం చేసుకొని పార్టీని బ్రహ్మాండంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నో పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం. మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాము.. తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్ర మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే పదవులను గడ్డిపోచలాగా వదులుకున్నమని మంత్రి గుర్తు చేశారు. శ్రీరాముడు 14 ఏండ్ల వనవాసము చేస్తే, కెసిఆర్ శ్రీరాముడు వలె ఉక్కు సంకల్పంతో ఆమరణ దీక్ష చేసి తెలంగాణా సాధించాడు. జాతీయ పార్టీలకు డిల్లీలో బాస్ లు ఉంటే, టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలే బాస్ లు..ప్రజలకు సంక్షేమ పథకాల గురించి వివరించి సభ్యత్వ నమోదు చేయించాలి.

ఒక పార్టీలో ఉండడం అందులో సభ్యులుగా ఉండడం అందులో నాయకుల ఉండడం ప్రజాప్రతినిధులు ఉండమని ఇటువంటివి నిజంగా కూడా ఒక అదృష్టంగా భావించాలి. చాలా రోజుల నుంచి మన కార్యక్రమాలు లేవు ప్రభుత్వ కార్యక్రమాలు తప్ప పార్టీ కార్యక్రమాలు దాదాపుగా పది నెలల నుంచి ఇటువంటి మీటింగ్స్ కూడా లేవు మళ్లీ తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం మరింత ఉత్సాహంతో ముందుకు పోవడం కోసం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది.తెలంగాణ ప్రజలు కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉధృతంగా ఉగ్రరూపంలో చాలా ఉత్సాహంగా చేయాల్సిన ఎటువంటి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.. ఎందుకంటే సభ్యత్వం పొందడం ద్వారా
పార్టీ బలోపేతం ఉంటుందని మంత్రి వివరించారు.

పార్టీయే ప్రతి ఒక్కరి బలం కాబట్టి అందరూ కలిసి పార్టీకి అంశగా ఉండాలి. నిబద్ధత ఉన్న కార్యకర్తలు అందరికీ పార్టీ అండగా ఉంటుంది.ప్రతి ఒక్కరికి సంక్షేమ అందించినటువంటి పార్టీ రేపు తిరిగి అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. ఆరు సంవత్సరాలలో దేశంలో ఎక్కడా జరిగినటువంటి అభివృద్ది కావచ్చు సంక్షేమం రావచ్చు తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా జరిగింది. దేశానికి ఒక దిక్సూచి లాగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తున్నది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉంది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో పోరాడిన నాయకులు, కార్యకర్తలు అందరికీ సీఎం అండతో తగిన న్యాయం జరుగుతుంది. తెరాసా పార్టీ ఒక గొడుగు…ఆ గొడుగు కింద ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఉండాలి. టీఆర్ఎస్ సభ్యత్వం ఉన్న కార్యకర్తలు ప్రాణాలు కోల్పోతే రెండు లక్షల రూపాయల భీమా అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -