సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న TRS పార్ల‌మెంట‌రీ పార్టీ భేటీ..

211
kcr
- Advertisement -

ఈరోజు ఉద‌యం 11 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశానికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ ఎంపీలు హాజ‌రు కానున్నారు. సోమ‌వారం నుంచి ప్రారంభం కానున్న పార్ల‌మెంట్ స‌మావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ చ‌ర్చించి, ఎంపీల‌కు దిశానిర్దేశం చేయ‌నున్నారు. అలాగే తెలంగాణ‌లో వ‌రి ధాన్యం కొనుగోలు విష‌యంలో కేంద్రం అవ‌లంభిస్తున్న వైఖ‌రిపై ప్ర‌ధానంగా చ‌ర్చించ‌నున్నారు.

- Advertisement -