33 జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాలు:హరీష్

404
harishrao
- Advertisement -

దేశంలోనే మొట్టమొదటి సారిగా ఏకకాలంలో 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపన చేసుకుంటున్నామని చెప్పారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.సిద్దిపేట శివారులోని పొన్నాల సమీపంలో TRS పార్టీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన జడ్పి చైర్ పర్సన్ వేలేటి రోజా శర్మ భూమిపూజ చేయగా ఎమ్మెల్యేలు హరీశ్ రావు, సతీష్ కుమార్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ఇతర పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఈ సందర్బంగా మాట్లాడిన హరీష్‌ 2001లో TRS స్థాపించిన నాడు పార్టీ కార్యాలయంలో ఎక్కడ పెట్టికోవాలన్నా వీలు లేని పరిస్థితి ఉండేదన్నారు. జలదృశ్యంలో పార్టీ కార్యాలయం పెట్టు కుంటే నాటి పాలకులు బలవంతంగా తొలగించారని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాదించుకోవడం, రాజధానిలో అద్భుతమైన పార్టీ కార్యాలయం నిర్మించికున్నామని చెప్పారు. ఇప్పుడు 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మించుకుంటున్నాం.. జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇదొక వేదికగా ఉంటుందన్నారు. ఎకరం స్థలంలో పక్క వాస్తు ప్రకారం దసరా నాటికి భవనాన్ని నిర్మించుకొని ప్రారంభించుకుంటామని చెప్పిన హరీష్.. బిల్డింగ్ నిర్మాణానికి త్వరలోనే ముగ్గురు సభ్యులతో కమిటీ వేస్తామన్నారు. వారి ఆధ్వర్యంలో వేగంగా అద్భుతమైన భవనం నిర్మించుకుందామన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో TRS పార్టీ భవనాలకు శంకుస్థాపన చేసుకుంటున్నామని జడ్పీ ఛైర్మన్ రోజా శర్మ తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో తొలి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా అవకాశం లభించిందని… అందరి సహకారంతో నా బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా.. రాష్ట్రంలోనే జిల్లా అన్ని రంగాల్లో ముందు ఉండేలా అందరి సహకారంతో పని చేస్తానని చెప్పారు.

దసరా నాటికి పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తవుతుందని ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్ తెలిపారు. 27న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

పార్టీ కార్యాలయ నిర్మాణానికి పార్టీ నిధులతో పాటు ఎమ్మెల్యేలు హరీశ్ రావు, సతీష్ కుమార్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, కార్పొరేషన్ చైర్మన్లు శ్రీనువాస్ రెడ్డి, బాలమల్లు, జడ్పీ చైర్ పర్సన్ లు తమ ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకరించారు. వీరితో పాటు పలువురు నాయకులు విరాళాలు ప్రకటించారు.

- Advertisement -