టీఆర్ఎస్‌తోనే అచ్చంపేట అభివృద్ధి సాధ్యం..

166
achempet trs
- Advertisement -

అచ్చంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నారై టీఆర్ఎస్ బృందం అచ్చంపేట ప్రచారం నిర్వహించింది. ఈనేపథ్యంలో ముందుగా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజును తన క్యాంప్ కార్యాలయంలో కలుసుకొని వారి సూచనలు సలహాల మేరకు ఎమ్మెల్సీ నారాయణ రెడ్డితో కలిసి వివిధ వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత జరిగిన అభివృద్ధిని అలాగే ముఖ్యంగా ఇటీవల మున్సిపల్ మంత్రి కేటీఆర్ అచ్చంపేట వచ్చి ప్రారంభించిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు.

ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మీడియాతో మాట్లాడుతూ, సాగు, తాగు నీరు, 24 గంటల ఉచిత విద్యుత్తు, పెన్షన్లు, షాదీముబారక్ తదితర సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడమే కాకుండా, రూ. 5 కోట్ల అంచనా వ్యయంతో అంబేద్క‌ర్ భవనానికి, రూ. 4.5 కోట్ల వ్యయంతో సమీకృత మార్కెట్ సముదాయాన్ని, రూ. 75 లక్షల వ్యయంతో మార్కెట్ యార్డ్ ఉత్తర భాగం రోడ్డు విస్తరణకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయడమే కాకుండా, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కోరిక మేరకు మున్సిపాలిటీ అభివృద్డికై రూ. 25 కోట్లు అచ్ఛంపేట మున్సిపాలిటికి కేటాయిస్తామని హామీ ఇచ్చారని ప్రజలకు గుర్తు చేసారు.ఇలా చెప్పుకుంటూ పోతే టీఆర్ఎస్‌ ప్రభుత్వంతోనే అచ్చంపేట అభివృద్ధి సాధ్యమని ప్రజలంతా విజ్ఞతతో ఓటేసి 20 వార్డుల్లో టీఆర్ఎస్‌ అభ్యర్థుల్ని భారీ మెజారిటీ తో గెలిపించాలని విజ్ఞప్తి చేసారు.

ఎన్నారై టీఆర్ఎస్‌ యూకే కార్యదర్శి సత్యమూర్తి చిలుముల మాట్లాడుతూ, తెలంగాణాలో ఎటువంటి ఎన్నికైనా ప్రజలంతా టీఆర్ఎస్‌కే ఓటేసి కెసిఆర్ నాయకత్వాన్ని బలపర్చుకోవాలని, అప్పుడే మనం కలలు కన్న బంగారు తెలంగాణ సాధ్యమని.. కాబట్టి ప్రజలంతా కారు గుర్తుకు ఓటేసి అచ్చంపేట మునిసిపాలిటీ పై గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు.

ఎన్నారై తెరాస నాయకుడు మల్లేష్ పప్పుల మాట్లాడుతూ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ అచ్చంపేట అభివృద్ధి కై ప్రత్యేక దృష్టి పెట్టారని, ప్రజలంతా టీఆర్ఎస్‌కి ఓటేసి గెలిపిస్తే అచ్చంపేట రాష్ట్రంలోనే గొప్ప మున్సిపాలిటీ కేంద్రంగా మారుతుందని తెలిపారు.

ప్రచారానికి సహకరించి ప్రోత్సహించిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకి, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డికి , టీఆర్ఎస్‌ అభ్యర్థులకు, స్థానిక నాయకులకు, కార్యకర్తలకు ఇతరులకు ఎన్నారై టీఆర్ఎస్‌ బృందం కృతఙ్ఞతలు తెలిపారు.

- Advertisement -