టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

219
TRS RAJYA SABHA
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లే అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు జరుగనున్న ఎన్నికల అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఇవాళ జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ భేటీలో ప్రకటించారు. టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాష్ ముదిరాజ్ పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. జోగినపల్లి సంతోష్ కుమార్ తో పాటు నల్గొండ జిల్లాకు చెందిన బడుగుల లింగయ్యయాదవ్, వరంగల్ జిల్లాకు చెందిన బండా ప్రకాష్ ముదిరాజ్ రేపు టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్ధులు నామినేషన్ వేయనున్నారు.

- Advertisement -