దేశ రాజకీయాలపై కీలక ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. హైటెక్స్‌లో జరిగిన టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశంలో మాట్లాడిన సీఎం… 75 సంవత్సరాల స్వాతంత్రంలో దేశంలో ఏం జరిగిందో దేశవాసులందరీ తెలుసునన్నారు. దేశంలో గుణాత్మకమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందని…అందుకే టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్(భారత రాష్ట్ర సమితి)గా మార్చాలని కోరుతున్నారని తెలిపారు.
ఇటీవల కాలంలో.. దేశంలో కొన్ని జాడ్యాలకు, ఆనారోగ్యకరమైనటువంటి ధోరణులు ప్రబలుతున్నాయన్నారు. ఇది భారత సమాజానికి ఏమాత్రం మంచిదికదాన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీగా.. ఒక రాష్ట్రంగా.. మనమేం చేయాలి.. మన కర్తవ్యం ఏమిటి అని అంతా ఆలోచించాలన్నారు. జాతీయ రాజకీయాల్లో ఏవిధమైన పాత్ర పోషించే విధంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘ఆత్మ నిర్బర భారత్’ అంటూ ఊదరగొట్టడమె తప్ప ప్రజల జీవన ప్రమాణాల్లో ఏ కొంచెం మెరుగుదల సాధించలేదు ఆత్మ నిర్బర భారత్ కాదుగానీ, బతుకు దుర్భర భారత్ గా మాత్రం దేశాన్ని మార్చింది.ఇకనైనా ఈ పరిస్థితి మారాలి. దేశానికి పట్టిన ఈ దుర్గశను వదిలించాలి. దేశ ప్రజల బతుకులను దుర్బరం చేస్తూ విభజించి పాలించే దుర్నీతికి పాల్పడుతున్న, ప్రజల బతుకుల మీదికి బుల్డోజర్లు నడిపిస్తున్న దుష్ట పరిపాలనను అంతమొందించేందుకు టీఆర్ఎస్ నడుం బిగించాలన్నారు