దీక్షాదివస్‌…తెలంగాణ ప్రజలకు ముఖ్యమైనరోజు

414
mp santhosh
- Advertisement -

దీక్షాదివస్ తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యమైన రోజు అని తెలిపారు టీఆర్ఎస్ ఎంపీలు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు ఎంపీలు కేకే,సంతోష్,బండా ప్రకాష్‌.

ఈ సందర్భంగా మాట్లాడిన వారు తెలంగాణ మలి దశ ఉద్యమం లో కేసీఆర్ దీక్షతో ప్రత్యేక రాష్ట్రం సాధ్యమయ్యేలా చేసిందన్నారు. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. అని నినదించి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి నేటికి దశాబ్దం పూర్తయ్యిన సందర్భంగా అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించామని చెప్పారు.

కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలు ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించారని….మన నిధులు మనకు రావాలని మన ఉద్యోగాలు మనకు రావాలని మన నీళ్లు మనకు రావాలని బంగారు తెలంగాణ కోసం ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఉద్యమించిన రోజు అన్నారు. తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని చెప్పారు.

TRS MPs Remebers DeekshaDiwas

- Advertisement -