- Advertisement -
రోజురోజుకు పెరుగుతున్న ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అవుతున్న నేపథ్యంలో పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన బాటపట్టారు. రెండవ రోజు వర్షాకాల సమావేశాల సందర్భంగా విపక్షాలు వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశాయి.
లోక్సభ, రాజ్యసభకు చెందిన టీఆర్ఎస్ ఎంపీలు గాంధీ విగ్రహం ముందు ప్లకార్డులు ప్రదర్శించి, మోదీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేశవరావు, నామానాగేశ్వరరావు, సంతోష్, దివకొండ దామోదర్రావులతో పాటు ఇతర ఎంపీలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
- Advertisement -