ధాన్యం కొనుగోళ్లు..పార్లమెంట్‌ను స్తంభింపజేసిన టీఆర్ఎస్

45
mp
- Advertisement -

ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్‌ను స్తంభింపజేసింది టీఆర్ఎస్. లోక్ సభలో ప్లకార్డులను ప్రదర్శిస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్ఎస్ ఎంపీలో ఆందోళనతో లోక్ సభ దద్దరిల్లింది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోందని…ఆహార ధాన్యాల సేకరణపై జాతీయ విధానం తేవాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎంపీల ఆందోళనతో లోక్‌సభకు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్.

ఇక అటు రాజ్యసభలోనూ ధాన్యం సేకరణపై వాయిదా తీర్మానం ఇచ్చింది టీఆర్ఎస్. ఇది చాలా ముఖ్యమైన అంశమని దీనిపై చర్చ చేపట్టాలని ఎంపీ సురేశ్‌ రెడ్డి కోరారు. అయితే రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు దీనిని తిరస్కరించడంతో రాజ్యసభ నుండి టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు.

- Advertisement -