సీఎం కేసీఆర్‌తో టీఆర్ఎస్ ఎంపీల భేటీ..

52

మూడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ను టీఆర్ఎస్ లోకసభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు నేతృత్వంలో ఎంపీలు శనివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఢిల్లీలోని సీఎం నివాసంలో కేసీఆర్‌ను ఎంపీలు నామ నాగేశ్వరరావు, కేఆర్ సురేష్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, బి. వెంకటేశ్ నేత కలిశారు. కేసీఆర్‌తో టీఆర్ఎస్ ఎంపీలు మర్యాదపూర్వకంగా భేటీ అయి పలు అంశాలపై చర్చించారు.