టీఆర్ఎస్ ఎంపీల ఆందోళనతో.. దద్దరిల్లిన లోక్ సభ

210
mp kavitha
- Advertisement -

తెలుగు రాష్ట్రాల ఎంపీల ఆందోళనలతో లోక్ సభ దద్దరిల్లింది. రిజర్వేషన్ల అమలు రాష్ట్రాలకే అప్పగించాలని టీఆర్ఎస్‌ ఎంపీలు, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలంటూ ఏపీ ఎంపీలు ఆందోళన బాటపట్టారు. రిజర్వేషన్లు పెంచుకునే హక్కు రాష్ట్రాలకు ఉండాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. చర్చకు స్పీకర్ తిరస్కరించటంతో పోడియం ఎదుట నినాదాలు చేశారు. రాష్ట్రాల హక్కును హరిస్తున్నారంటూ నినాదాలు చేశారు.

వీరికి తోడుగా స్పెషల్ స్టేటస్‌పై ఏపీకి చెందిన ఎమ్మెల్యేలు ఆందోళన బాటపట్టారు. వీరి నినాదాలతో లోక్ సభ రెండు సార్లు వాయిదా పడింది. వాయిదా అనంతరం కూడా ఎంపీలు ఆందోళన కొనసాగించడంతో సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్.

అంతకముందు పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద టీఆర్‌ఎస్ ఎంపీలు ధర్నా చేపట్టారు. రిజర్వేషన్ల అమలు రాష్ర్టాలకే అప్పగించాలంటూ నినదిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. రిజర్వేషన్ల పెంపు అంశంపై కేంద్రం వైఖరిని టీఆర్‌ఎస్ ఎంపీలు తప్పుబట్టారు. రిజర్వేషన్లు తప్పకుండా సాధించుకోవాలని ఎంపీ కవిత అన్నారు. రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం ఆగదని తేల్చిచెప్పారు.

TRS MPs disrupt proceedings in Lok Sabha
విభజన హామీల అమలుపై కేంద్రం తాత్సారం చేస్తోందని టీడీపీ,కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన బాటపట్టారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ.. ఇది తెలుగువారి ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య అని, విభజన హామీలను నిర్లక్ష్యం చేస్తే కేంద్రానికి తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. రాజకీయంగా తమకు విభేదాలున్నా సమస్యల పరిష్కారంలో మాత్రం కలిసి ముందుకు సాగుతామన్నారు.

- Advertisement -