మొక్కలు నాటి ఫ్రీగా ఆక్సిజన్‌ పొందండి- ఎంపీ సంతోష్‌

602
mp santhosh
- Advertisement -

ఇటీవల టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన “గ్రీన్ ఛాలెంజ్” కార్యక్రమం రాష్ట్రం, దేశం, ఖండాంతరాలు దాటిన ఉద్యమంలా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ఎందరో ప్రముఖులు పాల్గొని తమ వంతుగా మొక్కలు నాటి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ ఛాలెంజ్‌లో ఒకరు మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని ఆహ్వానించాలి. ఎంపీ సంతోష్‌ ఈ కార్యక్రమంలో మొక్కటు నాటిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ.. వారిని ప్రశంసిస్తూ.. గ్రీన్‌ ఛాలెంజ్‌ను ముందు తీసుకెళ్తున్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్‌ పలు సామాజిక అంశాలపై సోషల్‌ మీడియాలో ఎప్పడూ చురుగ్గా ఉంటారు.

కాగా తాజాగా ఎంపీ సంతోష్‌ కుమార్‌ ఢిల్లీలో నెలకొన్న వాతావరణ పరిస్థితులపై ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. ఒకప్పుడు నీళ్లు అమ్మినప్పుడు నవ్వుకున్నాం. ఇప్పుడేమో గాలిని అమ్ముతున్నారు.. ఇది కఠినమైన వాస్తవం. ఏ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఢిల్లీలో ఆక్సిజన్‌ బార్లు తెరుచుకున్నాయి. ఢిల్లీ ప్రజలు స్వచ్ఛమైన గాలి కోసం 15 నిమిషాలకు రూ. 299 చెల్లిస్తున్నారు. ఇప్పుడు మొక్కలు నాటడంపై మేల్కొనకపోతే.. భవిష్యత్‌లో ఆక్సిజన్‌ కొనే పరిస్థితి తప్పక ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఫ్రీగా ఆక్సిజన్‌ పొందండి అని ఎంపీ సంతోష్‌ కుమార్‌ ట్విట్టర్‌ ద్వారా పిలుపునిచ్చారు.

When the water being sold we thought it was Fun,Then comes da hard realty of Air being sold today.Don’t take it for granted..

- Advertisement -