కరోనా నివారణకు స్వంత వైద్యం వద్దు- ఎంపీ సంతోష్‌

512
mp santhsos
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా ప్రభలుతున్న కరోనా వైరస్‌ భారత్‌లో రోజురోజుకూ పెరుగుతోంది. ఇక ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1037కు చేరినట్లు తెలుస్తోంది. అయితే ఈ మహమ్మరి నివారణకు ఈ జాగ్రత్తలు పాటించండి అంటూ సోషల్‌ మీడియాలో పలు రకాల వార్తలు వసున్నాయి. అయితే ఇందులో అసత్యప్రచారలు కూడా ఉన్నాయి. కారోనా సోకకుండా ఉండేందుకు అలా చేయండి.. ఇది చేయండి.. ఇవి తినండి.. కరోనా రాకుండా ఉండాలంటే ఈ మందులు వేసుకోండి అని.. ఇంట్లోనే సోంత వైద్యం చేసుకోవచ్చని ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే కొందరు ఇలాంటి సొంత వైద్యం చేసుకొని మరిన్ని రోగాలు కొనితెచ్చికుంటున్నారు. కరోనా సోకకుండా ప్రభుత్వలు, డాక్టర్లు, ప్రముఖులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సొంత చికిత్స విధానంపై టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు… కరోనా లక్షణాలకు సొంత వైద్యం చాలా ప్రమాదకరమన్నారు. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలన్నారు. స్వంత వైద్య విధానానికి అందరూ దూరంగా ఉండాల్సిందిగా పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నంబర్లకు కాల్‌ చేసి సమాచారం పొందవచ్చన్నారు. కరోనా నియంత్రణకు ప్రజలందరూ సామాజిక దూరం పాటించాలని ఎంపీ సంతోష్ కుమార్‌ పేర్కొన్నారు.

- Advertisement -