తెలంగాణ ప్రజలకు, సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు కృతజ్ఞతలు.. నామా

705
TRS MP Nama Nageswara Rao
- Advertisement -

17వ లోక్‌సభలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సభ్యులు ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేశారు. టీఆర్‌ఎస్‌ నుంచి 9 మంది ఎంపీలు, కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఇద్దరు, ఎంఐఎం నుంచి ఒక ఎంపీ ప్రమాణస్వీకారం చేశారు. టీఆర్‌ఎస్ ఫ్లోర్‌ లీడర్‌గా నామా నాగేశ్వరరావు ఎన్నుకోగా.. డిప్యూటి ఫ్లోర్ లీడర్ గా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా సభలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ..రాష్ట్ర ప్రయోజనాలు, విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై కలిసి కట్టుగా పోరాటం చేస్తాం.తెలంగాణ ప్రజలు టీఆరెస్‌పై, మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం.కేంద్రం నుంచి తెలంగాణ గడిచిన 5 ఏళ్లలో ప్రత్యేకంగా నిధులు ఇచ్చిందేం లేదు.వీలైనన్ని ఎక్కువ నిధులు సాధించేందుకు కృషి చేస్తాం అన్నారు.

డిప్యూటి ఫ్లోర్ లీడర్, కొత్త ప్రభాకర్ రెడ్డి.. టీఆర్‌ఎస్‌పై నమ్మకం ఉంచి 9 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు.నీళ్లు, నిధులు, నియామకాల సాధనతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయింది. గడిచిన 5 ఏళ్లలో అనేక సమస్యలపై పోరాటం చేశాం.హైకోర్టు, జాతీయ రహదారులు ఇలా ప్రతిదాన్ని పోరాడే సాధించుకున్నాం. భవిష్యత్ లోకూడా ఇలాంటి పంథానే అవలంభిస్తాం.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులకు నిధులు సాధించేందుకు కృషి చేస్తాం.గడిచిన 5 ఏళ్లలో బీజేపీ సహకరించలేదు.బీజేపీ నేతలు భ్రమలో ఉన్నారు. బీజేపీ నేతలు మాట్లాడితే సరిపోదు, వారేం చేస్తారో ప్రజలు గమనిస్తున్నారు. మాటలు చెప్పి ఊరుకుంటే ప్రజలే నిలదిస్తారని ఆయన తెలిపారు.

పెద్దపల్లి ఎంపీ నేతగాని వెంకటేష్ మాట్లాడుతూ.. భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు.కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రయోజనాలను సాధించడమే లక్ష్యంగా పార్లమెంట్‌లో పనిచేస్తాం. కొంతమంది దుష్ప్రచారాలు చేసినా, వాస్తవాలు ప్రజల ముందున్నాయి. తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ పనిచేస్తున్నందునే ప్రజలు రెండోసారి అధికారం కట్టబెట్టారని అన్నారు.

- Advertisement -