‘ఉమెన్స్‌ డే’ విషెస్‌ తెలిపిన ఎంపీ కవిత..

263
TRS MP Kavitha
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె,నిజామాబాద్ ఎంపీ,తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, నేడు మహిళాదినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళామణులకు ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని, అందివచ్చిన అవకాశాలు ఉపయోగించుకొని ముందడుగువేసి విజయం సాధించాలని ఎంపీ కవిత ఆకాంక్షించారు. కేవలం మహిళా దినోత్సవం నాడే కార్యక్రమాలు నిర్వహించడం కాదని, సంవత్సరమంతా కార్యక్రమాలు కొనసాగాలని అమె అన్నారు.

మహిళల భద్రత, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆడబిడ్డల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో షీటీంలు ఏర్పాటు చేశాక నేరాల సంఖ్య తగ్గిందని ఎంపీ కవిత అన్నారు. నేరం జరుగకముందే నిరోధించగలిగితే నేరాలు తగ్గుతాయని, తెలంగాణలో చేసి చూపించామని కవిత వివరించారు. మహిళలు వంటింటికే పరిమితమనే ఆలోచనా ధోరణిని మార్చగలిగామని చెప్పారు.

- Advertisement -