బడ్జెట్ బాగుంది : ఎంపీ కవిత

248
TRS MP Kavitha Response On Budget 2017
- Advertisement -

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో చాలా మంచి విషయాలున్నాయని టీఆర్ఎస్ ఎంపీ కవిత చెప్పారు.చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ట్యాక్స్ తగ్గించడం మంచి పరిణామమన్నారు. బడ్జెట్ ను పూర్తిగా చదివిన తర్వాత స్పందిస్తామని కవిత తెలిపారు. తెలంగాణకు ఎయిమ్స్ ఇవ్వకపోవడంపై నిరాశ చెందామన్నారు.

ర‌ైల్వే బ‌డ్జెట్‌ను సాధార‌ణ బ‌డ్జెట్‌లో విలీనం చేస్తూ కొత్త విధానంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ బాగుందన్నారు ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పార్ల‌మెంటులో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన త‌రువాత తాము ఆయ‌న‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యామ‌ని టీఆర్ఎస్ ఎంపీ జితేంద‌ర్‌రెడ్డి అన్నారు. గ‌తంలో తెలుగు రాష్ట్రాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఎయిమ్స్ ప్రకటించిన నేపథ్యంలో తాము ఈ రోజు తెలంగాణలో ఎయిమ్స్ అంశంపై జైట్లీతో మాట్లాడామ‌ని తెలిపారు. కొత్త విధానం వల్ల సభలో తెలంగాణకు ఎయిమ్స్ అంశంపై మాట్లాడలేదని జైట్లీ త‌మ‌కు చెప్పార‌ని ఆయ‌న అన్నారు. ఈ బడ్జెట్‌లో తెలంగాణ ఎయిమ్స్‌కు నిధులు కేటాయించినట్లేనని జైట్లీ త‌మ‌కు భ‌రోసా ఇచ్చినట్లు ఆయ‌న చెప్పారు.

గతంలో మాదిరిగా ప్రణాళికా కేటాయింపులను సభలో ప్రకటించే సంప్రదాయానికి కేంద్ర ప్ర‌భుత్వం స్వ‌స్తి చెప్పింద‌ని ఆయ‌న తెలిపారు. ఇక‌పై కేంద్ర మంత్రిత్వ శాఖలకు కేటాయించిన బడ్జెట్ నుంచే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు పొందాల్సి ఉంటుందని ఆయ‌న వివ‌రించారు. కేంద్ర‌ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఈ విధానంతో పెండింగ్ పనులు వేగంగా జ‌రుగుతాయ‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.

నిజాయతీగా ట్యాక్స్ క‌డుతున్న వారికి బడ్జెట్‌ పలు ప్రయోజనాలను చేకూర్చుతుందని ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం మీడియాతో మాట్లాడిన జైట్లీ నల్లధనంపై పోరాటానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అభివృద్ధికి ఆస్కారం ఉన్న రంగాలపై దృష్టి పెట్టి వాటికి అనుగుణంగా బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు చెప్పారు. మౌలిక వ‌స‌తుల అభివృద్ధికి కూడా ప్రాధాన్య‌త‌నిచ్చిన‌ట్లు అరుణ్ జైట్లీ తెలిపారు.

- Advertisement -