తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని రామలింగేశ్వరస్వామిని కోరినట్లు తెలిపారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నిర్విరామంగా కొనసాగాలని అన్నారు.
ఈసందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. కీసరగుట్ట తన నియోజకవర్గంలో ఉండటం తన పూర్వజన్మ సుకృతమన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రజలు పాడిపంటలతో, సుఖశాంతులతో ఉండాలని స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు నవీన్ రావు, శంబీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద పలువురు ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు.