ముగ్గురు సిట్టింగ్‌లకు షాక్ ఇవ్వనున్న కేసీఆర్.!

221
kcr trs mps list
- Advertisement -

పార్లమెంట్‌ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న కొద్ది తెలంగాణలో పొలిటికల్ హీట్ తారస్ధాయికి చేరింది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్‌,ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు అనంతరం ఓ క్లారిటీకి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో దూకుడు మీదున్న టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికలోనూ అదేజోరు కంటిన్యూ చేస్తోంది.

పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించడం,16 ఎంపీ స్థానాలను భారీ మెజార్టీతో గెలిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఓ వైపు కేటీఆర్‌ సన్నాహాక సమావేశలు నిర్వహించనుండగా మరోవైపు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తిచేయనున్నారు సీఎం కేసీఆర్‌.

ఇప్పటికే ఆయ‌న 13 స్థానాల‌కు అభ్యర్థుల‌ను ఫైన‌ల్ చేశార‌ని తెలుస్తోంది. ఇందులో ఎనిమ‌ది మంది సిట్టింగ్‌ల‌కు ఆయ‌న మ‌ళ్లీ ఛాన్స్ ఇవ్వాల‌ని డిసైడ్ అయిన‌ట్లు స‌మాచారం. సిట్టింగ్‌లు తిరిగి స్ధానం దక్కించుకునే వారిలో భువ‌న‌గిరి-బూర న‌ర్సయ్య గౌడ్‌, క‌రీంన‌గ‌ర్‌-వినోద్ కుమార్, నిజామాబాద్- క‌ల్వకుంట్ల క‌విత, మెద‌క్‌-కొత్త ప్రభాక‌ర్ రెడ్డి, జ‌హిరాబాద్-బీబీ పాటిల్‌, అదిలాబాద్‌-జి.న‌గేష్‌, ఖ‌మ్మం-పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌- ఏపీ జితేంద‌ర్ రెడ్డిలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మ‌ల్కాజిగిరి నుండి ఓ వ్యాపారవేత్తకు సీటు కేటాయించారని ప్రచారం జరుగుతుండగా పెద్దప‌ల్లి సీటు మాజీ ఎంపీ వివేక్‌ పేరు ఫైనల్‌ చేశారని సమాచారం. ఇక చేవెళ్ల పార్లమెంట్‌ స్థానంలోమాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ తరఫున కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

వ‌రంగ‌ల్ ఎంపీ స్ధానాన్ని కడియం శ్రీహరి,మహబూబాబాద్ ఎంపీ స్ధానానికి మాలోత్ కవిత పేరు పరిశీలిస్తున్నారు. ఇక నల్గొండ స్ధానం నుండి సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి లేదా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉంది. సికింద్రాబాద్ నుంచి బీసీ సామాజ‌క‌వ‌ర్గం అభ్యర్థిని బ‌రిలో దింపాల‌నేది కేసీఆర్ ఆలోచ‌న‌. మొత్తంగా ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చే లోపే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు గలాబీ బాస్ సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -