పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా చేస్తాం-కవిత

256
TRS MP Candidate Kavitha
- Advertisement -

ఈ రోజు లోక్‌ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కల్లకుంట్ల కవిత ప్రచార సభకు హాజరైయ్యారు. భీంగల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ సభలో కవిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, జిల్లాకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఇక్కడి పేదలందరికి డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టించి ఇస్తం. సొంత జాగా ఉన్నవాళ్లు ఇండ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తమని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి..పంటలకు గిట్టుబాటు ధర వచ్చేట్లు చేస్తమన్నారు. రెండు నెలల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు. ఈవీఎంలు ఎక్కువ ఉన్నాయని అయోమయానికి గురి కావొద్దని ఓటర్లకు కవిత సూచించారు. మొదటి ఈవీఎంలో రెండో స్థానంలోనే కారు గుర్తుంటుందని చెప్పారు. 16 స్థానాలలో టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించాలని కవిత ప్రజలను కోరారు.

- Advertisement -