మైక్‌ ఉందని ఇష్టంవచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం-సుమన్

262
- Advertisement -

కాంగ్రెస్ నేతలు మైక్ ఉందని పూనకం వచ్చినట్టు మాట్లాడుతున్నారని.. గాంధీభవన్‌లో కూర్చొని ఇష్టంవచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఊరుకోరని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ అన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చామని.. దేశంలోనే సీఎం కేసీఆర్ నెంబర్ వన్ ముఖ్యమంత్రి అని స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని.. అసెంబ్లీ సమావేశాలు సాఫీగా సాగాలంటే కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రావద్దన్నారు. ఉద్యమ సమయంలో  కీలక పాత్ర పోషించి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేసిన సీఎం కేసీఆర్‌పై ఇకనైనా కాంగ్రెస్ నేతలు విమర్శలు మానుకోవాలని సూచించారు.

2014 ఎన్నికలకు ముందే కోదండరాం కాంగ్రెస్ తో ఒప్పందం కుదుర్చుకున్నారని.. కాంగ్రెస్ డైరెక్షన్‌లో కోదండరాం పని చేస్తున్నారన్న వాస్తవం మహాకూటమితో రుజువైందన్నారు. తెలంగాణ వికాసాన్ని కోదండరాం కోరుకుంటున్నారా..? లేక విధ్వంసాన్ని కోరుకుంటున్నారా..? చెప్పాలని సుమన్ నిలదీశారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోకు ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని.. నిరుద్యోగ భృతి రూ. 3,016 ఇవ్వడం వల్ల ఉద్యమంలో పాల్గొన్న వేలాది మందికి ఊరటనిస్తుందని సుమన్ స్పష్టం చేశారు.

- Advertisement -