వనదుర్గమ్మను దర్శించుకున్న :ఎమ్మెల్సీ కవిత

76
- Advertisement -

మెదక్‌ ఏడుపాయ‌ల వ‌న దుర్గామాత‌ను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ కవితతో పాటు ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ సునీతా ల‌క్ష్మారెడ్డి ఉన్నారు.

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ కవిత అమ్మ‌వారికి ప‌ట్టు వ‌స్త్రాలు, బంగారు బోనం స‌మ‌ర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మ‌వారి స‌న్నిధిలో క‌విత‌, ప‌ద్మాదేవేంద‌ర్ రెడ్డి గాజులు తొడిగించుకున్నారు. అనంత‌రం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ క‌విత మాట్లాడుతూ.. 100 మంది ఆడ‌ప‌డుచుల‌తో క‌లిసి అమ్మ‌వారికి బోనాలు స‌మ‌ర్పించామ‌ని తెలిపారు. ఏడుపాయల ఆల‌యానికి ప్ర‌త్యేక చ‌రిత్ర ఉంద‌న్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత జిల్లాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి అని తెలిపారు. దీంతో సిద్ధిపేట జిల్లాలో ఉన్న మల్లన్న స్వామి దేవాలయం, ఏడుపాయల దుర్గామాత ఆలయం, మల్లన్న సాగర్ అభివృద్ధితో  ఈ ప్రాంతం కూడా వృద్ధి చెందింద‌న్నారు.

సీఎం కేసీఆర్ ఈ ప్రాంత అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు కేటాయించార‌ని తెలిపారు. ప్ర‌జ‌లంద‌రికీ ఎమ్మెల్సీ క‌విత ముందుగా స‌ద్దుల బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపారు.

- Advertisement -