పూలమ్మ ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత

84
art
- Advertisement -

హైదరాబాద్‌లోని మదాపూర్‌ ఆర్ట్‌గ్యాలరీలో ఏలె లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ పూల నేపథ్యంలో నిర్వహించిన పూలమ్మ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన కళా రూపాలను తిలకించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బతుకమ్మ సందర్భంగా పూలమ్మ పేరుతో ఆర్ట్‌ గ్యాలరీ ఏర్పాటుపై చాలా సంతోషంగా ఉందన్నారు. పూల కాన్సెప్ట్‌తో తెలంగాణలోని ఆర్ట్‌ను, కల్చర్‌, జీవన శైలిని చూపేలా ఉన్న ఎగ్జిబిషన్‌ మనసును పులకించిపోయేలా అందంగా తీర్చిదిద్దినందుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. లలిత కళా అకాడమీని ప్రారంభించాలనే కళాకారుల వినతిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని కవిత హామీ ఇచ్చారు.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ ప్రత్యేక గీతాలను ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో ప్రారంభించారు. కొదారి శ్రీనివాస్ పర్యవేక్షణలో బతుకమ్మ పాటలు-2022- తెలంగాణ పూల పండుగ పేరుతో రూపొందించిన ఏడు బతుకమ్మ పాటలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఎస్ ఫుడ్స్ చైర్మన్‌ రాజీవ్ సాగర్, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఉపాధ్యక్షురాలు మంచాల వరలక్ష్మి, సాంస్కృతిక విభాగం కన్వీనర్ కోదారి శ్రీను, జాగృతి నాయకులు విక్రాంత్ రెడ్డి, కుమారస్వామి, బల్మూరి సుమన్, తిరుపతి వర్మ, అర్చన, చరణ్, ఉపేందర్, కాంచనపల్లి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -