సీఎం కేసీఆర్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపిన :కవిత

81
- Advertisement -

సింగ‌రేణి కాలరీస్‌ సంస్థ ఉద్యోగుల‌కు సీఎం కేసీఆర్ ద‌స‌రా కానుక ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆనందం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా సింగ‌రేణి కార్మికుల త‌ర‌పున సీఎం కేసీఆర్‌కు క‌విత ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా, అత్యంత ఎక్కువ మొత్తంలో దసరా బోనస్ అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం…ఈ ఏడాది అర్హులైన  కార్మికులకు రూ. 368 కోట్లు అందించ‌డం గొప్ప విషయమ‌న్నారు. కార్మికుల శ్రమ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణి సంస్థ మరింత ముందుకు సాగుతూ, దేశానికి వెలుగులు పంచాలని ఆకాంక్షిస్తున్నానని క‌విత పేర్కొన్నారు.

- Advertisement -