ఏపీ ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది..

254
TRS MLAs Slams BJP And Congress
- Advertisement -

పోగిరెడ్డిపాడు నీటి వివాదంపై కాంగ్రెస్‌,బీజేపీలు చేస్తున్న వ్యాఖలు తీవ్రంగా ఖండించారు షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. గురువారం టీఆర్‌ఎస్‌ఎల్పీ ఆఫీస్‌లో మీడియా సమావేశంలో షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రితో కేసీఆర్ కుమ్మక్కు అయ్యారు అనడం హాస్యాస్పదమన్నారు. ఏపీ ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది. కాంగ్రెస్-బీజేపీ ఢిల్లీ విడిచిపెట్టి గల్లీలో మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు.

గతంలో పెండింగ్ ప్రాజెక్టులగా ఉన్న వాటిని టీఆరెస్ ప్రభుత్వం వచ్చాక రన్నింగ్ ప్రాజెక్టులగా మారాయని ఎమ్మెల్యే అన్నారు. మా ప్రాంతంలో నీళ్లు లేక ఇబ్బందులు పదుతున్నారు.ఇప్పడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మాకు దిక్కు. గతంలో కనీసం తాగేందుకు నీళ్లు లేవు..కానీ ఇప్పుడు భగీరథ నీళ్లు వచ్చాయని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తెలిపారు.

ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో అణిచివేయ్యబడ్డ-నిర్లక్షానికి గురైన జిల్లా మహబూబ్ నగర్.కానీ టీఆరెస్ ప్రభుత్వం వచ్చాక మహబూబ్ నగర్ ఇప్పుడిప్పుడే చిగురించుకుంటుంది. మా జిలాల్లో ఉన్నవన్ని గతంలో పెండింగ్ ప్రాజెక్టులు అనే పేరు ఉంది. కానీ కేసీఆర్ వాటిని రన్నింగ్ ప్రాజెక్టు అని మార్చారు. పాలమూరు ప్రాజెక్టు వల్ల నా నియోజకవర్గలో 1లక్షకు పైగా ఎకరాలకు నీళ్లు వస్తాయి. ప్రతిపక్షాలు వెనుకబడ్డ మహబూబ్ నగర్ జిల్లాపై రాజకీయాలు చేయొద్దు అని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు.

- Advertisement -