ఇది కేవలం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం- ఎమ్మెల్యే మాగంటి

349
- Advertisement -

వెంగల్ రావు నగర్ అయ్యప్ప గ్రౌండ్స్ లో ఆదివారం టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ దేదీప్య ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొని ముగ్గుల పోటీలను పరిశీలించి వారికి బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ కరోనా కష్టకాలంలో పిలవగానే ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలకు మా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ఖాతాల్లో 50 వేల కోట్లు రైతుబంధు కింద జమ చేశారని భారత దేశం మొత్తంలో ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఎవరు చేయలేదని ఇది కేవలం తెలంగాణ సీఎం కేసీఆర్ ద్వారానే సాధ్యమైందని ప్రజలు గుర్తించాలని అన్నారు.

ఈ ముగ్గుల పోటీలలో ఎవరు మొదటి రెండవ మూడవ ప్రైజులు అనేది నిర్ణయించడం కష్టమని అందరు మహిళలు విజేత లేనని అందరికీ బహుమతులు ఇస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ఈ సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి చేరాలనే ఉద్దేశంతో ఈ సారి గాలిపటాల మీద ఈ సంక్షేమ పథకాలు ముద్రించి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుందని.. దీని ద్వారా కేసీఆర్ చేసే ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందరికీ తెలుస్తుంది అని ఎమ్మెల్యే తెలిపారు.

- Advertisement -