బండి సంజయ్..ఓ బచ్చా: జీవన్ రెడ్డి

298
jeevan reddy
- Advertisement -

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహారం చూస్తే కొత్త బుచ్చగాడు పొద్దుదేరగడు అన్నట్టు ఉందన్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన ఒక్క సర్పంచ్,ఒక్క మున్సిపాలిటీని కూడా గెలుచుకోలేని పార్టీ నేతలు కూడా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

కిషన్ రెడ్డి,లక్ష్మణ్‌లే టీఆర్ఎస్‌ని ఏమి చేయలేకపోయారు బండి సంజయ్ ఎంత అంటూ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన పుట్టాడో లేదో కూడా తెలియదని ఆయన ఓ బచ్చా అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిధులు ఇచ్చామని చెప్పిన బండి సంజయ్… ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇప్పించగలవా అని ప్రశ్నించారు. జార్ఖండ్, రాజస్థాన్,మధ్యప్రదేశ్‌లో బీజేపీని ప్రజలు ఓడించిన విషయాన్ని మర్చిపోవద్దన్నారు. అవగాహన లేని నాయకుడిని పార్టీ అధ్యక్షుడిగా నియమించారని దుయ్యబట్టారు.కేంద్ర మంత్రి గా ఉన్న కిషన్ రెడ్డి నే ఒక్క రూపాయి నిధులు తేలేదు…సంజయ్‌ వల్ల ఏమవుతుందని ప్రశ్నించారు.

- Advertisement -