బీజేపీ నేతలు పగటి కలలు మానండి..!

466
TRS MLA Diwakar Rao
- Advertisement -

ఇవాళ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నివాసం వద్ద ఎమ్మెల్యే దివాకర్ రావు మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిన్న మంచిర్యాలలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్,మాజీ ఎంపీ వివేక్‌లు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఎమ్మెల్యే దివాకర్‌ అన్నారు.

అంతరాష్ట్ర వివాదాలు లేకుండా చాణక్య నీతితో కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో సీఎం కేసీఆర్ పూర్తీచేస్తే బీజేపీ నేతలు చూసి ఓర్వలేక పోతున్నారు.రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి,సంక్షేమ పథకాల అమలుపై ఒకవైపు కేంద్ర మంత్రులు ప్రశంసిస్తుంటే రాష్ట్ర బీజేపీ నేతలకు కనిపించడంలేదా అని ఆయన ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో 1లక్షకుపైగా ఉద్యోగాలిచ్చిన ఘనత సీఎం కేసీఆర్ ది. సీఎం కేసీఆర్ చేసిన యజ్ఞాలు హోమాల వల్లనే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండి,పచ్చని పంటలతో రైతులు సంతోషంగా ఉన్నారు. బీజేపీ నేతలు పగటి కలలు కనడం మాని,ఇక ఎన్ని జన్మలు ఎత్తిన రాష్ట్రంలో అధికారంలోకి రాలేమని గ్రహించాలని ఎమ్మెల్యే దివాకర్‌ తెలిపారు.

- Advertisement -