ప్లాన్ ఏ..ప్లాన్ బీ..కాంగ్రెస్ మైండ్ బ్లాంక్.. !

226
Uttam, kcr
- Advertisement -

అధికార టీఆర్ఎస్ వ్యూహాలతో కాంగ్రెస్ నేతల మైండ్ బ్లాంక్ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి నుండి ఇప్పుడిప్పుడే తెరుకుంటున్న హస్తం నేతలకు పార్టీ ఫిరాయింపులు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. రోజుకో ఎమ్మెల్యే కారువైపు పరుగులు తీస్తుండటంతో ఎటు పాలుపోని స్థితిలో కాంగ్రెస్ నేతలు బిక్కమోహం వేశారు. ఓ వైపు పార్లమెంట్ ఎన్నికలు మరోవైపు ఎమ్మెల్యేల ఫిరాయింపు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.

కాంగ్రెస్ ముఖ్త్ తెలంగాణలో భాగంగా టీఆర్ఎస్ ఎత్తులకు కాంగ్రెస్ చిత్తవుతోంది. ఆపరేషన్ ఆకర్ష్‌ ప్లాన్ ఏ..ప్లాన్ బీ ఎజెండాతో ముందుకు సాగుతోంది టీఆర్ఎస్. అసలు ఏంటీ ప్లాన్ ఏ..ప్లాన్ బీ అనుకుంటున్నారా..?. టీఆర్ఎస్ ప్లాన్ ఏ ప్రకారం కాంగ్రెస్‌లో ఉన్న 19 మంది ఎమ్మెల్యేలో 13 మందిని టీఆర్ఎస్‌లో చేర్చుకోవడం ఒక ఎత్తుగడ.

వీరికి ఎక్కడా టీఆర్ఎస్ కండువా కప్పకుండా సీఎల్పీపై తిరుగుబాటు చేస్తున్నట్లు తమలో ఒకరికి సీఎల్పీ నేతగా ఎన్నకున్నట్లు లేఖ ఇప్పించడం. దీంతో వీరినే స్పీకర్‌ అసలైన సీఎల్పీగా గుర్తించడం మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వెనుక బెంచిలు కేటాయించి దిక్కుతోచని స్థితిలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నెట్టడం ప్లాన్‌ ఏలో భాగం.

ఇక ప్లాన్ బీ విషయానికొస్తే పార్టీ మారి వ‌చ్చిన ఎమ్మెల్యేల‌తో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లి బంపర్ మెజార్టీతో గెలిపించుకుని కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బతీయడమే టార్గెట్‌.

ఎన్నికలకు ముందు కొంతమంది ఎన్నికల తర్వాత మరికొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేలా ప్లాన్ చేశారు గులాబీ బాస్. ఎవ‌రిని ఎప్పుడు అవ‌స‌రం అనుకుంటే అప్పుడు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి .. కాంగ్రెస్ కు షాకియ్య‌డమే అస‌లు ఎజెండాగా క‌నిపిస్తుంది. మొత్తానికి సీఎం కేసీఆర్ వేస్తున్న ఎత్తులకు కాంగ్రెస్‌ చతికిలపడటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -