పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ ముందంజ

105
gellu
- Advertisement -

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించగా టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది.హుజూరాబాద్ లో 822 పోస్టల్ బ్యాలెట్లకు గాను 753 ఓట్లు పోల్ అయ్యాయి. వాటిలో టీఆర్ఎస్ 160 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టు సమాచారం అందుతోంది. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కు 90 శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయి.

మొత్తం 2 లక్షల 5 వేల 236 ఓట్లు పోల్ అయ్యాయి. మొదటి 6 రౌండ్లలో హుజూరాబాద్ మండల ఓట్లు.. 7 నుంచి 10వ రౌండ్ వరకు వీణవంక ఓట్లు.. 11 నుంచి 15వ రౌండ్ వరకు జమ్మికుంట మండల ఓట్లు.. 16 నుంచి 18వ రౌండ్ వరకు ఇల్లందకుంట మండల ఓట్లు.. 19 నుంచి 22వ రౌండ్ వరకు కమలాపూర్ మండల పరిధిలోని ఓట్లు లెక్కిస్తారు.

- Advertisement -