హైదరాబాద్ లో దూసుకుపోతున్న కారు..

214
trs hyderabad
- Advertisement -

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. పలు నియోజకవర్గాల్లో తొలి రౌండ్ ఫలితం పూర్తయ్యేసరికి ఆధిక్యంలో దూసుకుపోతోంది. సిద్దిపేటలో రెండో రౌండ్‌లో 13,040 ఓట్ల ఆధిక్యంలో హరీష్‌రావు ఉన్నారు. ఇక గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆధిక్యంతో భారీ మెజార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు. వేములవాడ, మేడ్చల్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యంలో ఉండగా ఎల్లారెడ్డి, కామారెడ్డిలో కాంగ్రెస్ ఆధిక్యం దూసుకుపోతోంది.

హైదరాబాద్ లో కారు దూసుకుపోతోంది. శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది.వరంగల్ వెస్ట్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి వినయ్ భాస్కర్ తొలి రౌండ్ పూర్తయ్యే సరికి 3 వేల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. కోడంగల్‌లో రేవంత్ రెడ్డి, మక్తల్‌లో జలంధర్ రెడ్డి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. తుంగతుర్తి,పాలేరు,పాలకుర్తి,పరకాలలో టీఆర్ఎస్‌ మునుగోడులో కాంగ్రెస్‌ అభ్యర్ధి ఆధిక్యంలో ఉన్నారు. మెదక్‌లో పద్మాదేవేందర్ రెడ్డి, సిరిసిల్లలో కేటీఆర్‌,జహీరాబాద్‌లో టీఆర్ఎస్‌ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.

మక్తల్‌లో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు.. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1228 కాగా, టీఆర్‌ఎస్‌కు 429, కాంగ్రెస్‌కు 312, బీజేపీకి 298 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డి బరిలో ఉన్నారు.

- Advertisement -