గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ముస్తాబాద్ మండల టీఆర్‌ఎస్ నాయకులు జమ్మి చెట్టు మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శరత్ రావు , రైతు బంధు మండల అధ్యక్షులు గోపాల్ రావు, టీఆర్‌ఎస్ మండల్స్ అధ్యక్షులు సురేంద్ర రావు, సర్పంచ్ సునీత మరియు ఇతర 22 పంచాయతీ సర్పంచ్లకు జమ్మి చెట్టు మొక్కలు పంపిణి చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అందరూ పూజించుకునే జమ్మి చెట్లును తెలంగాణ రాష్ట్ర వృక్షంగా ప్రభుత్వం గుర్తించింది. అయితే అనేక కారణాలతో అంతరించిపోతున్న జమ్మి చెట్లను దాని విశిష్టత రీత్యా ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో ఉండేలా.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున ఊరు ఊరుకో జమ్మి చెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు నినాదాన్ని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తీసుకున్నారు. అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
విశిష్టమైన చెట్లను పెంచుదాం.. భవిష్యత్ తరాలను కాపాడుకుందాం అన్నారు. తెలంగాణలో దసరా నాడు జమ్మి చెట్టును పూజించడం ఆచారం. జమ్మి ఆకులను బంధుమిత్రులకు ఇచ్చిపుచ్చుకుని అందరికీ మంచి జరగాలని కోరుకోవటం కూడా ఆనవాయితీ. ఈ ప్రాధాన్యతల దృష్ట్యా రానున్న దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఊరుఊరుకో జమ్మిచెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమం మొదలవుతుందని అన్ని గ్రామాలు, గుడులకు వీటిని పంపిణీ చేస్తామన్నారు.