నేడు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న కేటీఆర్..

239
ktr
- Advertisement -

టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కల్వకుంట్ల తారకరామారావు బాధ్యతల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు ఉదయం 11.56 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు కేటీఆర్. ఈ సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఏర్పాట్ల‌ను టీఆర్ఎస్ నేత‌లు త‌ల‌సాని, దానం నాగేంద‌ర్, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ప‌రిశీలించారు.

ktr

బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆసుప‌త్రి నుంచి తెలంగాణ భ‌వ‌న్ వ‌ర‌కూ ర్యాలీ నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్. అనంత‌రం తెలంగాణ భ‌వ‌న్ లో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి, జ‌య‌శంక‌ర్ సార్ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి కార్య‌క‌ర్త‌ల‌నుద్దేశించి ప్ర‌సంగిస్తార‌ని చెప్పారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తన ఈ ర్యాలీకి తరలిరానున్నట్టు తలసాని తెలిపారు. తెలంగాణభవన్ పరిసరాలను గులాబీమయంగా మార్చారు. కార్యక్రమాన్ని వీక్షించేందుకు వీలుగా తెలంగాణభవన్ ఆవరణలో ఎల్‌ఈడీలు, మైకులు ఏర్పాటుచేశారు.

- Advertisement -