రేవంత్‌ రెడ్డికి దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన క్రిశాంక్‌..

462
TRS Leader Krishank Salms Congress MP Revanth Reddy
- Advertisement -

ఎదుటి వారి కుటుంబ సభ్యులపై తప్పుడు ఆరోపణలు, అవాస్తవాలు మాట్లాడే ముందు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ముందు తన కుటుంబం చేస్తున్న మోసాల గురించి మాట్లాడాలి అన్నారు టీఆర్‌ఎస్‌ నాయకులు క్రిశాంక్. కేటీఆర్ గారి బావమరిది సైంటిస్ట్ ఆ అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి.. మరి తన తమ్ముళ్లు అనుముల కొండల్, కృష్ణలు నాసా నుంచి తిరిగి వచ్చింరా, గోల్కొండ ఫార్మా కెమికల్ కంపెనీలో మందులు తయారు చేస్తున్నారు వారు సైంటిస్ట్ లా ? అని క్రిశాంక్‌ ప్రశ్నించారు.

TRS Leader Krishank Salms Congress MP Revanth Reddy

IICT ఒక పరిశోధన సంస్థ, ఎన్నో విద్యాసంస్థలు, కంపెనీలతో పరిశోధన ఒప్పందాలు చేసుకుంటుంది. దేశంలో టాప్ సంస్థ అయిన CIPLA తో గత నెలనే IICT కొరోన వైరస్‌కు మందు తెచ్చే ఒప్పందం చేసుకుంది, మరీ దానికి రేవంత్ సమాధానం ఎంటి ? అన్నారు. బట్ట తలకు మోకాలికి ముడి పెట్టినట్టు ఉంది రేవంత్ రెడ్డి వైనం, ఇలాంటి విపత్కర సమయంలో ఇలాంటి రాజకీయాలు కాంగ్రెస్ నాయకులకు తగునా ? అని విమర్శించారు క్రిశాంక్.

- Advertisement -