ఎంపీ సంతోష్ బర్త్‌ డే.. మొక్కలు నాటిన జోగినిపల్లి అజిత్ కుమార్

276
green challenge
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ముందుగానే ఈరోజు తన నివాసంలో తన మిత్రులతో కలిసి మొక్కలు నాటారు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి అజిత్ కుమార్.

ఈ సందర్భంగా అజిత్ కుమార్ మాట్లాడుతూ సంతోష్ ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా వృధా ఖర్చు కాకుండా వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు తన బర్త్ డేకు గిఫ్ట్ లు తెకుండా మొక్కలు నాటాలని పిలుపునివ్వడం చాలా సంతోషకరమని తెలిపారు. ఈ సందర్భంగా సంతోష్ ఆలోచనకు కృతజ్ఞతలు తెలిపారు.

j ajith kumar

భవిష్యత్తులో తన పుట్టిన రోజున కూడా ఇదేవిధంగా వేడుకలు చేసుకోకుండా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేస్తామని పిలుపునిచ్చారు‌. ఈ సందర్భంగా తన మిత్రులు ముగ్గురుని మొక్కలు నాటాలని కోరారు.1) కిషోర్ రావు PS TO మేయర్; 2)పరమేశ్వర్ రెడ్డి Ads PS TO CM, 3)వీర్ల వెంకటేశ్వరరావు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

TRS Leader J Ajithkumar accepts green challenge. he plants three sapplings at his House..TRS Leader J Ajithkumar accepts green challenge..

- Advertisement -