- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ నేత జోగినిపల్లి అజిత్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆయన తోపాటు టీఆర్‌ఎస్ నేత వీర్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అజిత్ కుమార్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మొక్కలు నాటాలని కోరారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
- Advertisement -